తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Delhi Jewellery Shop Robbery : స్ట్రాంగ్​ రూమ్​కు రంధ్రం.. జ్యువెలరీ షోరూమ్​లో భారీ చోరీ.. రూ.25కోట్ల విలువైన నగలు మాయం

Delhi Jewellery Shop Robbery : జ్యువెలరీ షోరూమ్ స్ట్రాంగ్​ రూమ్​ గోడకు రంధ్రం చేసి భారీ చోరీకి పాల్పడ్డారు దుండుగులు. రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు. దిల్లీలో జరిగిందీ ఘటన.

Delhi Jewellery Shop Robbery
Delhi Jewellery Shop Robbery

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 3:31 PM IST

స్ట్రాంగ్​ రూమ్​కు రంధ్రం.. జ్యువెలరీ షోరూమ్​లో భారీ చోరీ.. రూ.25కోట్ల విలువైన నగలు మాయం

Delhi Jewellery Shop Robbery : దేశ రాజధాని దిల్లీలోని ఓ జ్యువెలరీ షోరూమ్​లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్​ రూమ్​ గోడకు రంధ్రం చేసి.. లోపలకు చొరబడి రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హజ్రత్​ నిజాముద్దీన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని భోగల్​.. జంగ్​పురా ప్రాంతంలో ఉన్న ఉమ్రావ్​ సింగ్​ జ్యువెలరీ షోరూమ్​లో ఈ చోరీ ఘటన జరిగింది. ఆదివారం దుకాణాన్ని మూసివేసిన యజమాని సంజీవ్​ జైన్​.. మంగళవారం తెరవగా అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుకాణ​ యజమానితో పాటు షాప్​లో పనిచేస్తున్న ఉద్యోగులందరనీ విచారించారు. షోరూమ్​ వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించారు.

'భారీ చోరీ ఘటన'
ఈ ఘటనపై దిల్లీ సౌత్​- ఈస్ట్​ డీసీపీ రాజేశ్​ డియో స్పందించారు. ఇది భారీ చోరీ ఘటనగా వర్ణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్​లను గమనించినట్లు చెప్పారు. ఫోరెన్సిక్​ నిపుణులను రప్పించినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

'సర్వం దోచేశారు!'
Robbery At Gold Showroom : "ఆదివారం రాత్రి 8 గంటలకు అంతా చెక్​ చేసుకుని షాప్​ను మూసివేశాం. సోమవారం దుకాణానికి సెలవు. మంగళవారం షాప్​ను తెరిచి చూడగా మొత్తం దుమ్ము, ధూళితో నిండి ఉంది. అనుమానం వచ్చి స్ట్రాంగ్​రూమ్​ వద్దకు వెళ్లాం. స్ట్రాంగ్​ రూమ్​ గోడకు భారీ రంధ్రాన్ని గమనించాం. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. సుమారు రూ.5-7 లక్షలు నగదు సహా రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. షోరూమ్​ లోపలకు చొరబడి అంతా దోచేశారు. సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు" అని యజమాని సంజీవ్​ జైన్​ తెలిపారు.

Gold Shop Robbery Viral Video : నగల దుకాణంలో చోరీ.. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు.. ఆఖరికి..

Axis Bank Robbery Raigarh : యాక్సిక్ బ్యాంక్​లో భారీ దోపిడీ.. సిబ్బందిని గదిలో వేసి రూ.7కోట్లు చోరీ

ABOUT THE AUTHOR

...view details