తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో టపాసులపై నిషేధం పొడగింపు.. ఈసారీ నిశబ్దంగానే దీపావళి! - AAP govt announces complete ban on firecrackers

firecrackers ban in Delhi: వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో గతేడాది లాగే ఈ సారి కూడా ఇక దీపావలి పండుగు టపాసుల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Delhi imposes complete ban on firecrackers till Jan 1, 2023
Delhi imposes complete ban on firecrackers till Jan 1, 2023

By

Published : Sep 7, 2022, 12:57 PM IST

firecrackers ban in Delhi: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. జనవరి 1, 2023 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ బుధవారం వెల్లడించారు.

"అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నాం. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలం" అని గోపాల్ రాయ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సారి ఆన్‌లైన్‌ విక్రయాల పైన ఆంక్షలు విధించినట్లు మంత్రి తెలిపారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా.. జనవరి 1, 2023 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

సాధారణంగా దిల్లీలో వాయు కాలుష్యం మిగతా నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాణసంచాతో గాలి నాణ్యత మరింత తగ్గుతోంది. దీపావళి సందర్భంగా దిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలోకి చేరుకుంటుండంతో టపాసుల అమ్మకాలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరు 28 నుంచి 2022 జనవరి 1 వరకు బాణసంచా విక్రయాలు, వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించి టపాసులు పేల్చిన వారిపై చర్యలు కూడా తీసుకుంది.

ఇదీ చదవండి:ఆ రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు.. దేశవ్యాప్తంగా సోదాలు.. బంగాల్ మంత్రికి సీబీఐ సెగ

'అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పపై డీఐజీకి ఫిర్యాదు చేస్తా'

ABOUT THE AUTHOR

...view details