అలోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు దిల్లీ హైకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని అందులో ఆదేశించింది. " రాందేవ్ వీడియో క్లిప్పులు చూశాను. అలోపతి చికిత్స ప్రొటోకాల్‌ను ఆయన అపహాస్యం చేశారు" అని న్యాయమూర్తి జస్టిస్ సి. హరిశంకర్ తెలిపారు.
రాందేవ్ వ్యాఖ్యలు..
కొవిడ్-19(Covid-19) చికిత్సలో ఉపయోగిస్తున్న అలోపతి ఔషధాల(Allopathic medicine) సామర్థ్యంపై రాందేవ్(Ramdev) గతంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మందుల కారణంగా లక్షలాది మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. చివరకు ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయితే.. ఆ క్రమంలోనే అలోపతి ఔషధాలపై సందేహాలను లేవనెత్తుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు 25 ప్రశ్నలు సంధించారు.
ఇదీ చదవండి:సమయం దాటినా రెండో డోసు తీసుకోని వారు 11 కోట్ల పైనే..