ట్విట్టర్ తీరుపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
ట్విట్టర్ తీరుపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం - delhi hc serious on twitter
నూతన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్ తీరుపై మండిపడింది దిల్లీ హైకోర్టు. అధికారుల నియామకంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ట్విట్టర్, దిల్లీ హైకోర్టు
అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్లో ట్విట్టర్ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని పేర్కొంది. అధికారిని నియమించకపోవడం కచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.
Last Updated : Jul 6, 2021, 12:51 PM IST