Omicron community spread: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 961 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దిల్లీలో అత్యధికంగా 263 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. 252 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉందని తెలిపింది.
India Omicron variant news
ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి మొదలైందని దిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ఇటీవల విదేశీ ప్రయాణాలు చేయనివారివారిలోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయని చెప్పారు. దిల్లీలో విశ్లేషించిన 115 నమూనాలలో 46 శాతం ఒమిక్రాన్‌కు సంబంధించినవేనని స్పష్టం చేశారు. దిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో 200 మంది కొవిడ్ బాధితులు ఉన్నారని చెప్పారు. అందులో 102 మంది దిల్లీకి చెందినవారని వెల్లడించారు.
Delhi Omicron cases
"ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో 115 మందికి లక్షణాలు లేవు. ముందుజాగ్రత్తగానే వారిని ఆస్పత్రుల్లో ఉంచాం. విదేశీ ప్రయాణాలు చేయనివారికీ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అంటే.. సామాజిక వ్యాప్తి వేగంగా జరుగుతోందని అర్థం."
-సత్యేందర్ జైన్, దిల్లీ వైద్య శాఖ మంత్రి
డిసెంబర్ 30 నాటికి దిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో 70 మంది ఒమిక్రాన్ బాధితులు అడ్మిట్ అయ్యారని ఆ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. అందులో 50 మంది కోలుకున్నారని చెప్పారు. బాధితుల్లో చాలా మందికి లక్షణాలు లేవని వెల్లడించారు. కేవలం నలుగురు బాధితులకు స్వల్పంగా జ్వరం, గొంతు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు.
మరోవైపు, రోజువారీ కరోనా కేసుల సంఖ్య సైతం పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 13 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 268 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,486 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి:దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 13వేల మందికి వైరస్