యోగా గురు బాబా రాందేవ్‌కు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ వైద్య సంఘం (డీఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఈమేరకు ఆదేశించింది. ఆ వ్యాజ్యానికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. జూలై 13న తదుపరి విచారణ జరగనుంది.
బాబా రాందేవ్‌కు హైకోర్టు నోటీసులు - delhi hc summons baba ramdev
బాబా రాందేవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీ వైద్య సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. డీఎంఏ వ్యాజ్యానికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.
![బాబా రాందేవ్‌కు హైకోర్టు నోటీసులు delhi high court to baba ramdev](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11999000-260-11999000-1622705972264.jpg)
బాబా రాందేవ్‌కు సమన్లు
పతంజలి సంస్థ రూపొందించిన కరోనిల్ కిట్‌పై రాందేవ్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా చూడాలంటూ డీఎంఏ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. కరోనిల్ కరోనాను నివారించలేదని.. రాందేవ్ చేసినవ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొంది.
ఇదీ చదవండి :Ramdev: 'రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పాల్సిందే'
Last Updated : Jun 3, 2021, 4:37 PM IST