తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2021, 4:56 AM IST

ETV Bharat / bharat

ట్విట్టర్​పై దిల్లీ హైకోర్టు అసంతృప్తి

ఐటీ నిబంధనల అమలుకు సంబంధించి ట్పిట్టర్​ వైఖరిపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీపీఓగా తాత్కాలిక ఉద్యోగిని నియమించిన ట్విట్టర్​ తీరును తప్పుపట్టింది. వారం రోజుల్లోగా కొత్త ప్రమాణ పత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ట్విట్టర్​ను ఆదేశించింది.

delhi high court to twitter, దిల్లీ హైకోర్టు ట్విట్టర్
'సీపీఓగా తాత్కాలిక ఉద్యోగిని నియమిస్తారా?'

నిబంధనల ముఖ్య అమలు అధికారిగా (సీపీఓ) తాత్కాలిక ఉద్యోగిని నియమించిన ట్విట్టర్​ తీరుపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సామాజిక వేదిక కొత్త ఐటీ నిబంధనలను పాటించడం లేదని స్పష్టం చేసింది. సంస్థలో అత్యంత కీలకమైన నిర్వహణ అంశాలు చూసే ఉద్యోగి లేదా సీనియర్ ఉద్యోగిని సీపీఓగా నియమించడాన్ని నిబంధనలు తప్పనిసరి చేశాయని జస్టిస్​ రేఖా పాటిల్​ గుర్తుచేశారు. ట్విట్టర్​ మాత్రం తన ప్రమాణ పత్రంలో మూడోపక్ష గుత్తేదారు ద్వారా తాత్కాలిక ఉద్యోగిని నియమించినట్లు వెల్లడించిందని చెప్పారు.

"ప్రమాణ పత్రం ప్రకారం సీపీఓ ఉద్యోగి కాదు. ఇది ప్రమాదకరం. నిబంధనల పట్ల కొంత స్పృహతో ఉండాలి.. వాటిని గౌరవించాలి. కొత్త ప్రమాణ పత్రం దాఖలు చేయండి. ఇది ఆమోదయోగ్యం కాదు. మేం మీకు చాలా అవకాశాలు ఇచ్చాం. న్యాయస్థానం ప్రతిసారీ ఇలాగే చేస్తుందని భావించొద్దు. మూడోపక్ష గుత్తేదారు పేరు వెల్లడించండి. కంటింజెంట్ పదాన్ని వివరించండి" అని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాజాగా మరో ప్రమాణ పత్రం దాఖలు చేయడానికి వారం రోజుల సమయం ఇచ్చారు.

ఇదీ చదవండి :'ఆస్తులు ధ్వంసం చేయడం స్వేచ్ఛ కాదు'

ABOUT THE AUTHOR

...view details