తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుంకం లేకుండా 'యాంఫోటెరిసిన్​-బీ' దిగుమతి! - యాంఫోటెరిసిన్​-బీ పై దిల్లీ హైకోర్టు

బ్లాక్​ ఫంగస్ వ్యాధి నివారణను వినియోగించే యాంటీఫోటెరిసిన్​-బీ మందును సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు దిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి గంటా కీలకమేనని.. అందువల్ల కేంద్రం యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

mucormycosis drug
యాంఫోటెరిసిన్​-బీ

By

Published : May 28, 2021, 6:57 AM IST

మ్యూకర్​మైకోసిస్​ ఫంగస్​ సోకిన వారి చికిత్సకు వినియోగించే యాంటీఫోటెరిసిన్​-బీ మందును సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు దిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. ఈ ఔషధం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేసే అంశంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకునేంతవరకు.. దిగుమతిదారులు ఓ పూచీకత్తును సమర్పిస్తే సరిపోతుందని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్​ జస్మీత్​ సింగ్​లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పూచీకత్తు ప్రకారం.. ఒకవేళ కేంద్రం కస్టమ్స్​ సుంకాన్ని మాఫీ చేయకపోతే సంబంధిత దిగుమతిదారులు సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

కేంద్రం పరిశీలించాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి గంటా కీలకమేనని.. అందువల్ల కేంద్రం యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. వేల మంది బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఈ మందు అవసరమని, అందువల్ల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కీలకంగా పరిశీలించాలని సూచించింది.

సంబంధిత ఔషధాన్ని పొందలేని మ్యూకర్​మైకోసిస్ ఫంగస్​ బాధితుడొకరు వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చదవండి :'టీకాలు ముందే కొనాల్సింది.. 200 కోట్ల డోసులు అసాధ్యం'

ABOUT THE AUTHOR

...view details