సింఘు సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించిన అధికారులు.. రైతులను రోడ్డుకు ఒకవైపే పరిమితం చేసేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వాతావరణం వేడెక్కింది.
బారికేడ్ల ఏర్పాటును అడ్డుకుంటున్న అన్నదాతలు బారికేడ్లు ఏర్పాట్లు చేసిన అధికారులు భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది స్థానికుల నిరసన
అంతకుముందు.. సింఘు సరిహద్దును ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ కొంతమంది స్థానికులు ప్లకార్డుల చేతపట్టి, నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అక్కడ నుంచి ఒక్క రోజులో రైతులు వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు.
ఆందోళన చేస్తున్న స్థానికులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన ఆందోళనలు రెండు నెలలు శాంతియుతం కొనసాగినా.. ఈ నెల 26న నిర్వహించిన ట్రాక్టర్ కవాతుతో అంతా తారుమారైనట్లు కనిపిస్తోంది.
ఇదీ చూడండి:'ఎర్రకోట' ఘటనలపై దేశద్రోహం కేసు