తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో ఈసారి దీపావళి బాంబులు లేనట్టే - Diwali 2020 news updates

బాణాసంచాపై నిషేధం విధించింది దిల్లీ ప్రభుత్వం. వాయు కాలుష్యం, పండుగ సమయంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

Delhi govt bans firecrackers ahead of Diwali
దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- బాణాసంచాపై నిషేధం

By

Published : Nov 5, 2020, 10:18 PM IST

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ బాణాసంచాపై నిషేధం విధిస్తూ దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో నానాటికి క్షీణిస్తున్న వాయు నాణ్యత నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.

ఓవైపు పండుగ సీజన్ వల్ల పెరుగుతున్న కొవిడ్​ కేసులు, మరోవైపు వాయుకాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా మెజిస్ట్రేట్లతో చర్చించిన అనంతరం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుదల సహా ఆక్సిజన్, ఐసీయూ పడకల సంఖ్య పెంచాలని నిర్ణయించారు.

కాళీ పూజలోనూ నిషేధం..

కరోనా విస్తరిస్తున్న వేళ కాళీమాత పూజలో బాణాసంచాపై నిషేధం విధించింది కోల్​కతా హైకోర్టు. నవంబరు 15న కాళీ పూజ జరగనున్న నేపథ్యంలో బాణాసంచా కాల్చడం, అమ్మకాలను నిషేధించింది. జగద్ధాత్రి, ఛాత్​, కార్తిక్ పూజల్లోనూ బాణాసంచాను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను విచారించిన న్యాయస్థానం.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి:2021 ఎన్నికల బరిలో కమల్​ హాసన్​

ABOUT THE AUTHOR

...view details