దిల్లీకి ఇకపై సొంత పాఠశాల విద్యాబోర్డు ఉండనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు దిల్లీ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు. దిల్లీ విద్యా వ్యవస్థ ఇకపై బట్టీపట్టే విధానంలో కాకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు. 2021-22 విద్యాసంవత్సరంలో దిల్లీ పాఠశాల విద్యాబోర్డు కింద 20 నుంచి 25 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో బోర్డుకు పరిపాలనా వ్యవస్థ ఉంటుందన్నారు. రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం కూడా కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. రెండింటిలో కూడా నిపుణులు, విద్యావేత్తలు, వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు ఉంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
'దిల్లీలో ఇకపై సొంత పాఠశాల విద్యాబోర్డు' - delhi cm
దిల్లీకి ఇప్పటినుంచి సొంత పాఠశాల విద్యాబోర్డు ఉండనుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరంలో దిల్లీ పాఠశాల విద్యాబోర్డు కింద 20 నుంచి 25 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. బట్టీపట్టే విధానం కాకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే దిశగా ముందుకెళ్తామన్నారు.
'దిల్లీలో ఇకపై సొంత పాఠశాల విద్యాబోర్డు'
ప్రస్తుతం దిల్లీలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు, 17 వందల వరకూ ప్రైవేటు బడులు నడుస్తుండగా ఇవన్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సీబీఎస్ఈ కింద పనిచేస్తున్నాయి.
ఇదీ చదవండి :అప్పగింతల్లో ఏడ్చి ఏడ్చి వధువు మృతి