దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ సాయాన్ని దిల్లీ ప్రభుత్వం కోరింది. కొవిడ్ బోగీల ద్వారా 5,000 పడకలను శాకర్ బస్తీ, ఆనంద్ విహార్ స్టేషన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మకు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ దేవ్ లేఖ రాశారు.
"దిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆధ్వర్యంలోని పడకలు నిండిపోతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి చికిత్స అందించేందుకు అత్యవసరంగా మరిన్ని పడకలు కావాల్సి ఉంటుంది. అందుకే.. ఆనంద్ విహార్, శాకుర్ బస్తీ ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లలో 5,000 పడకల సామర్థ్యంతో కొవిడ్ బోగీలను ఏర్పాటు చేయాల్సిందిగా దిల్లీ ప్రభుత్వం తరఫున కోరుతున్నాం."
- విజయ్ కుమార్ దేవ్, దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి