సాగు చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద రైతులు చేపట్టనున్న శాంతియుత నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. అయితే కరోనా నిబంధనలను పాటించాలని.. రోజుకు 200 మందికి మించకుండా ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిరసన చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ నెల 22 నుంచి ఆగస్టు 9 వరకు అన్నదాతలు శాంతియుత నిరసనలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా సహా.. సంయుక్త పోలీస్ కమిషనర్ జస్పాల్ సింగ్‌లు.. జంతర్‌మంతర్ ప్రాంతాన్ని సందర్శించారు.