దిల్లీలో ఆదివారం స్వల్ప వర్షం కురిసింది. ఈ సమయంలో దిల్లీ అగ్నిమాపక శాఖకు వచ్చిన ఫోన్‌కాల్స్ చర్చనీయాంశంగా మారాయి. తమ ప్రాంతంలో చమురు వర్షం(ఆయిల్ రెయిన్) కురుస్తోందంటూ కాల్ చేసిన వ్యక్తులు ఫిర్యాదులు ఇచ్చారు. దిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి 57కు పైగా కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన ప్రతీ ఒక్కరూ చెప్పింది ఈ చమురు వర్షం గురించే.
దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతూనే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చమురు వర్షం వల్ల రోడ్లు జారుడుగా మారి ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొందరు అదుపుతప్పి పడిపోయారు. దీంతో జామియా నగర్‌కు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. ఈ విషయంపై ఫిర్యాదు మేరకు న్యూ ఫ్రెండ్స్ కాలనీలో అగ్నిమాపక సిబ్బంది పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.