దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దిల్షాద్ గార్డెన్ పారిశ్రామిక ప్రాంతం, దామోదర్ పార్క్‌లోని మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు 25 అగ్నిమాపక శకటాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది.