తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల మట్టి సత్యాగ్రహం- అమరులకు స్తూపం

దేశ రాజధాని దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో 'మట్టి సత్యాగ్రహం' చేపట్టిన రైతులు వివిధ ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి.. రైతు సంఘాల నేత రాకేశ్​ టికాయత్​కు అందిస్తున్నారు.

Delhi Farmers continued their protest with the name of Mitti Satyagraha
'మట్టి సత్యాగ్రహం' పేరిట దిల్లీలో రైతుల ఆందోళన

By

Published : Apr 6, 2021, 12:45 PM IST

దిల్లీ సరిహద్దుల్లో మట్టి సత్యాగ్రహం పేరుతో రైతులు నిరసన చేపట్టారు. గ్రామాల నుంచి అన్నదాతలు పంపిన మట్టిని రైతు సంఘాల నేతలు సేకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 150 గ్రామాల నుంచి 'రైతు స్వరాజ్య వేదిక' మట్టిని సేకరించి.. భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు రాకేశ్ టికాయత్‌కు అందజేసింది.

మంగళవారం మధ్యాహ్నం తర్వాత సింఘు సరిహద్దులో మరికొంత మట్టిని రైతులు టికాయత్​కు అందజేయనున్నారు. కర్షకులు తెచ్చిన మట్టితో దిల్లీ సరిహద్దులో అమరవీరుల స్తూపం నిర్మించాలని నిర్ణయించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో అమరులైన రైతులకు సింఘు, గాజీపుర్ వద్ద స్మారకం నిర్మించనున్నారు.

ఇదీ చదవండి:దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం

ABOUT THE AUTHOR

...view details