మదర్సాల్లో ఎలాంటి హిందూ మత గ్రంథాలను బోధించమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) గురువారం వెల్లడించింది. విద్యార్థులు తమకు నచ్చిన పాఠ్యాంశాలను ఎంచుకోవచ్చని పేర్కొంది. మదర్సాల్లో భగవద్గీత, రామాయణాన్ని పాఠ్యాంశాలుగా ఎన్ఐఓఎస్ ప్రవేశపెట్టనుందని బుధవారం వచ్చిన వార్తలపై ఎన్ఐఓఎస్ ఈ విధంగా స్పందించింది.
వివిధ రకాల కోర్సులను అందిస్తూ మదర్సాల్లో నాణ్యమైన విద్య కోసం ఎన్ఐఓఎస్ కృషి చేస్తోంది. అధికారిక విద్యా విధానానికి భిన్నంగా ఇందులో విద్యార్థులు వారికి నచ్చిన విషయాలను పాఠ్యాంశాలుగా ఎంచుకోవచ్చు.