తెలంగాణ

telangana

దిల్లీపై 'డెంగీ' పంజా- 23 మంది బలి

By

Published : Dec 27, 2021, 5:47 PM IST

Delhi Dengue cases: దేశ రాజధానిలో డెంగీ విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. గత ఐదేళ్లతో పోలిస్తే అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదిలోనే నమోదు కావడం గమనార్హం.

Delhi Dengue cases
దిల్లీలో డెంగీ కేసులు

Delhi Dengue cases: దిల్లీని విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో ఓ ఎనిమిది నెలల శిశువు సహా ఆరుగురు మైనర్లు డెంగీ కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మృతులతో కలిపి ఈ ఏడాదిలో దిల్లీలో డెంగీ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరింది. గత ఐదేళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదిలోనే నమోదు కావడం గమనార్హం.

Delhi dengue death toll: గత వారం కొత్తగా 130 డెంగీ కొత్త కేసులు నమోదు కాగా.. దిల్లీలో ఈ సీజన్​లో మొత్తం విషజ్వరాల పీడితుల సంఖ్య 9,545కు చేరిందని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. అయితే.. కొత్త కేసుల పెరుగుదల అంతకుముందు కొన్నివారాలతో పోలిస్తే తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశమని చెప్పింది.

Vector-borne disease delhi: దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం... దిల్లీలో డిసెంబరు 18 వరకు డెంగీ కారణంగా మరణించినవారి సంఖ్య 17గా ఉండగా... డిసెంబరు 25 నాటికి ఈ సంఖ్య 23కు పెరిగింది.

తాజాగా నమోదైన ఆరు డెంగీ మరణాలు... అక్టోబరు, నవంబరు చివరి వారంలో సంభవించాయని ఓ సీనియర్ అధికారి వివరించారు. మృతుల్లో కిరారీ ప్రాంతానికి 8 నెలల వయసు శిశువు కూడా ఉందని చెప్పారు. శిశువుతో పాటు పదిహేనేళ్ల బాలుడు, 8 ఏళ్ల బాలిక, 7,10,13 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు బాలురు కూడా మృతుల్లో ఉన్నారని చెప్పారు.

దిల్లీలో 'డెంగీ' గణాంకాలు..

  • దిల్లీలో డిసెంబరు 25 వరకు 1,269 డెంగీ కేసులు నమోదయ్యాయి.
  • 2020లో 1,072 డెంగీ కేసులు నమోదు కాగా.. 2019(2,036), 2018(2,798), 2017(4,726), 2016(4,431) కేసులు నమోదయ్యాయి.
  • 2015లో దిల్లీలో డెంగీ విపరీతంగా వ్యాపించింది. కేవలం అక్టోబరులోనే 10,600కు పైగా కేసులు వెలుగుచూశాయి.
  • 2016 తర్వాత దిల్లీలో అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. 2016లో 10మంది మృతిచెందారు.
  • డెంగీ కారణంగా 2019లో ఇద్దరు మరణించగా... 2018(4), 2017(10), 2016(10) మరణాలు నమోదయ్యాయి.
  • ఒక్క నవంబరు నెలలోనే దిల్లీలో 6,739 మంది విషజ్వరాల బారినపడ్డారు.

ఇదీ చూడండి:దిల్లీపై ఒమిక్రాన్​ పంజా.. ఒక్కరోజులో 63 కేసులు

ఇదీ చూడండి:'ఆరోగ్య సూచీ'లో కేరళ టాప్​- తెలంగాణ థర్డ్, ఏపీ ఫోర్త్

ABOUT THE AUTHOR

...view details