తెలంగాణ

telangana

By

Published : May 25, 2022, 6:16 PM IST

Updated : May 25, 2022, 7:44 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు జీవితఖైదు

yasin malik separatist: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు శిక్ష ఖరారయ్యింది. ఈ మేరకు రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష విధిస్తూ దిల్లీ పటియాల కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం ఏడు ఆరోపణలపై శిక్షలు విధించింది.

yasin malik latest news
yasin malik latest news

yasin malik separatist: కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌కు దిల్లీ పటియాల కోర్టు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కోర్టు దోషిగా తేల్చింది. 'ఉపా' చట్టం కింద 7 ఆరోపణలపై పటియాలా హౌస్‌ ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. మొత్తంగా అన్ని కేసుల్లో కలిపి 112.5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 10,75,000 జరిమానా విధించింది.

యాసిన్​ మాలిక్​కు కోర్టు విధించిన శిక్షల వివరాలు...

  • ఐపీసీ సెక్షన్ 120బి కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేలు జరిమానా
  • సెక్షన్ 121ఎ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేల జరిమానా
  • ఉపా చట్టం సెక్షన్‌ 13 కింద 5 సంవత్సరాల జైలు శిక్ష
  • ఉపా చట్టం సెక్షన్‌ 15 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష
  • ఉపా చట్టం సెక్షన్‌ 17 కింద జీవిత ఖైదు, 10 లక్షల జరిమానా
  • ఐపీసీ సెక్షన్‌ 121 కింద రుజువైన నేరానికి జీవిత ఖైదు
  • ఉపా చట్టం సెక్షన్‌ 17 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేలు జరిమానా
  • ఉపా చట్టం సెక్షన్‌ 20 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేలు జరిమానా
  • ఉపా చట్టం సెక్షన్‌ 38, 39 కింద 5 సంవత్సరాల జైలు శిక్ష, 5వేలు జరిమానా
  • అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని స్పష్టం చేసిన ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు

'ఉరిశిక్షే సరి...'
అంతకుముందు యాసిన్​ మాలిక్​కు ఉరిశిక్ష విధించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) దిల్లీలోని పటియాల కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఉగ్ర నిధులకు సంబంధించి యాసిన్‌ మాలిక్‌ దోషిగా తేలిన నేపథ్యంలో ఈ మేరకు మరణ శిక్ష విధించాలని కోరింది. అయితే.. శిక్ష విషయంలో మాలిక్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. "నేను ఏమీ అడగను. అంతిమ నిర్ణయం న్యాయస్థానానిదే. నేను ఏడుగురు ప్రధాన మంత్రులతో పనిచేశాను. గత 28 ఏళ్లలో తాను హింసకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాలిక్ చెప్పాడు. ఉరిశిక్ష వేసినా సమ్మతమే" అని యాసిన్ తరఫున కోర్టుకు నివేదించారు అతడి న్యాయవాది.

కశ్మీర్​లో హైఅలర్ట్​: యాసిన్‌ మాలిక్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో హైఅలెర్ట్‌ ప్రకటించారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో బంద్‌ వాతావరణం నెలకొంది. ఓల్డ్​సిటీలో ప్రజారవాణా సైతం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్​ వేర్పాటువాద నాయకుడు యాసిన్​ మాలిక్​ను పటియాల ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు మే 19న దోషిగా తేల్చింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారన్న కేసులో కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. టెర్రర్‌ఫండింగ్‌కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్‌ అంగీకరించాడు. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని.. ఆతడి ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్‌ఐఎని ఆదేశించింది.

ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్​, హిజ్బుల్​ ముజాహిద్దిన్​ చీఫ్​ సయ్యద్​ సలావుద్దీన్​ సహా పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్​ఎఫ్​ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్​ల హత్యల్లోనూ వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్​ నుంచి భారీ సంఖ్యలో పండిట్​లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్​ఎఫ్​కు సంబంధాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతం

Last Updated : May 25, 2022, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details