పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రసంస్థ అధినేత, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై దిల్లీ న్యాయస్థానం శనివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. జమ్ము-కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఈ వారెంట్ జారీ అయింది.
హఫీజ్ సయీద్‌పై అరెస్టు వారెంట్ - హఫీజ్ సయూద్ లేటెస్ట్ వార్త
ముంబయి ఉగ్రదాడుల సూత్రధాని హఫీజ్ సయీద్‌పై దిల్లీ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీచేసింది. ఉగ్రకార్యకలాపాలకు సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
హఫీజ్ సయీద్ అరెస్టుకు వారెంట్ జారీ
దీంతోపాటు ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలాని న్యాయస్థానం ఆదేశించింది. వీరిలో కశ్మీర్ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వాటాలి, వేర్పాటువాద నాయకుడు అల్పాఫ్ అహ్మద్ షా అలియాస్ ఫంతూష్, దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త నావల్ కిశోర్ కపూర్ ఉన్నారు. ప్రస్తుతం వీరు ముగ్గురు తిహాడ్ కేంద్ర కారాగారంలో ఉన్నారు.