తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఎం వ్యాఖ్యలను దేశానికి ఆపాదించకూడదు' - జైశంకర్​ తాజా

సింగపూర్​ వైరస్ రకం​తో దేశంలో మూడో దశముప్పు పొంచి ఉందని దిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జై శంకర్​ ఘాటుగా స్పందించారు. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలతో దేశాల మధ్య దీర్ఘకాలిక బంధాలు దెబ్బతింటాయని విమర్శించారు. దేశం తరఫున మాట్లాడేది దిల్లీ సీఎం కాదని పేర్కొన్నారు.

Jaishankar
విదేశాంగ మంత్రి జైశంకర్​

By

Published : May 19, 2021, 12:11 PM IST

Updated : May 19, 2021, 10:05 PM IST

దేశంలో సింగపూర్​ రకం వైరస్​తో మూడో దశ ముప్పు పొంచి ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలతో దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ విమర్శించారు. దిల్లీ సీఎం వ్యాఖ్యలు దేశానికి ఆపాదించవద్దని స్పష్టం చేశారు. కొవిడ్​పై పోరులో సింగపూర్​, భారత్​ బలమైన భాగస్వాములు అని​ పేర్కొన్నారు. ఆక్సిజన్​ సరఫరాలో దేశానికి సింగపూర్​ ఎంతగానో సాయపడిందని కొనియాడారు.

మరోవైపు.. సింగపూర్​ వైరస్​ రకంపై దిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలకు గాను భారత హైకమిషనర్​ను వివరణ ఇవ్వాలని సింగపూర్​ ప్రభుత్వం కోరిందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్​ బాగ్చి తెలిపారు. కరోనా​ వేరియంట్లపై వ్యాఖ్యలు చేసే బాధ్యతలు దిల్లీ సీఎంకు లేవని సింగపూర్​ ప్రభుత్వానికి హైకమిషనర్​ స్పష్టం చేశారని చెప్పారు.

ఇదీ చూడండి:'దేశంలోని కేసుల్లో కొత్త రకాలు పిల్లల్ని దెబ్బతీసేలా ఉన్నాయి'

Last Updated : May 19, 2021, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details