దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని కుదించారంటూ వచ్చిన వార్తలను కేంద్ర హోంశాఖ ఖండించింది. అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కుదించినట్లు అంతకుముందు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఆరుగురు అంగరక్షకులు ఉంటారని.. వారిలో నలుగురిని తొలిగించినట్లు పేర్కొన్నాయి.
ఇటీవల జరిగిన గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని తట్టుకోలేని భాజపా అధినాయకత్వం సిబ్బందిని తొలగించిందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం వివరణ ఇచ్చింది.