తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Arvind kejriwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్​కు కరోనా పాజిటివ్​ - అరవింద్ కేజ్రీవాల్ న్యూస్​

Arvind kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.

delhi cm arvind kejriwal tested corona positive
దిల్లీ సీఎం కేజ్రీవాల్​కు కరోనా పాజిటివ్​

By

Published : Jan 4, 2022, 8:25 AM IST

Updated : Jan 4, 2022, 11:06 AM IST

Arvind kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో తనకు పాజిటివ్‌ వచ్చిందన్నారు.

అయితే వైరస్ లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నట్లు కేజ్రీవాల్​ తెలిపారు.

కేజ్రీవాల్ ట్వీట్​

ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతితో దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దిల్లీలో 6నెలల తర్వాత అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 81శాతం ఒమిక్రాన్ వేరియంట్​వే కావడం ఆందోళన కలిగిస్తోంది.

కేంద్రమంత్రి, ఎంపీకి కూడా..

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండే, భాజపా ఎంపీ మనోజ్ సిన్హా కూడా తాము కరోనా బారినపడినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇదీ చదవండి:'81% కేసులు ఒమిక్రాన్​వే'.. సాధారణ జ్వరంలాంటిదేనన్న సీఎం!

Last Updated : Jan 4, 2022, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details