దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను కేంద్రం రద్దు చేయాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పరీక్షా కేంద్రాలు హాట్‌స్పాట్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో 6 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాసే అవకాశముందని.. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, టీచర్లకు వైరస్ సోకే ప్రమాదముందని హెచ్చరించారు.
ఆన్లైన్లో..
పరీక్ష నిర్వహణపై ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలన్నారు. తప్పనిసరి అనుకుంటే ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు జరపాలని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఒక్కరోజే.. 13 వేల 500 కేసులు నమోదయ్యాయని, రానున్న రోజుల్లో వ్యాప్తి మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి :4.8 కోట్ల రూపాయల పాత నోట్లు స్వాధీనం