తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల నిరసనపై సీఎంల మాటల యుద్ధం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలతో రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దిల్లీకి వెళ్లాలనుకుంటోన్న పంజాబ్​ రైతులను.. హరియాణా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిపై జలఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటలయుద్ధం మొదలైంది. రైతుల ఆందోళనలు విరమించాలని కోరిన కేంద్ర వ్యవసాయ మంత్రి.. ఈ చట్టాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

'Delhi Chalo' Protest LIVE: Security deployed at Delhi-Haryana border ahead of farmers' march
రైతుల ఆందోళనలపై సీఎంల మాటల యుద్ధం

By

Published : Nov 26, 2020, 4:21 PM IST

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 'దిల్లీ ఛలో'ను విజయవంతం చేసేందుకు ర్యాలీగా వెళ్తోన్న పంజాబ్​ రైతులను హరియాణాలో అడుగుపెట్టనివ్వట్లేదు. ఆ ప్రభుత్వం సరిహద్దులను మూసివేసింది. కొంతమంది ఆందోళనకారులపై జలఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు. ఫలితంగా.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

రైతులపై జలఫిరంగుల ప్రయోగం
రైతులను చెదరగొడుతున్న పోలీసులు

ఇదీ చూడండి:అంబాలా వద్ద ఉద్రిక్తత- బాష్పవాయువు ప్రయోగం

ఒకరిపై ఒకరు విమర్శలు..

దిల్లీకి వెళ్లే రైతులను హరియాణా సర్కార్​ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. శాంతియుతంగా చేస్తున్న నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, హరియాణా రైతులు చేపట్టిన ఆందోళనకు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా చేపట్టిన ప్రదర్శనను అడ్డుకోవటాన్ని తప్పుబట్టారు.

'రైతుల జీవితాలతో ఆడుకోవద్దు'

పంజాబ్​ ముఖ్యమంత్రిపై హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్ విరుచుకుపడ్డారు​. వ్యవసాయ చట్టాలపై రైతులను అమరీందర్​ తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తాను పంజాబ్​ ముఖ్యమంత్రిని సంప్రదించేందుకు 3 రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ స్పందించడం లేదని ట్వీట్​ చేశారు. కనీసం కరోనా సంక్షోభం వంటి సమయాల్లోనైనా ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఆపాలని అమరీందర్​కు హితవు పలికారు.

ఖట్టర్​ ట్వీట్​

ఇదీ చూడండి:ఉద్ధృతంగా రైతుల ఆందోళనలు

ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలు రైతులకు అవసరమని పునరుద్ఘాటించారు ఖట్టర్​. కనీస మద్దతు ధరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చిచెప్పారు.

కేంద్ర మంత్రి స్పందన..

రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ స్పందించారు. కొత్త వ్యవసాయ చట్టాలు అత్యవసరమని పునరుద్ఘాటించారు. రానున్న రోజుల్లో ఈ చట్టాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్​ రైతుల్లో ఉన్న సందేహాలు, చట్టాలపై ఉన్న వ్యతిరేక భావాలను తొలగించేందుకు కార్యదర్శి స్థాయిలో చర్చించినట్టు వెల్లడించారు. వచ్చే నెల 3న అక్కడి వారితో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఆగ్రహం తెచ్చుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు తోమర్​. సమస్యలపై చర్చించి, విభేదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీని ద్వారా సత్ఫలితాలు అందుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details