దిల్లీలో కొవిడ్ రోగుల కోసం 'ఆక్సిజన్ ఎక్స్ప్రెస్' రైళ్లు కావాలని కేజ్రీవాల్ సర్కార్ కోరినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ అరోరా వెల్లడించారు. ఇదే తరహాలో ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచీ అభ్యర్థనలు వచ్చాయని ఆయన తెలిపారు.
"ప్రాణవాయువు సరఫరా కోసం దిల్లీ నుంచి అభ్యర్థన అందింది. అందుకు సంబంధించిన ప్రణాళికను మేం సిద్ధం చేస్తున్నాం. రవూర్కెలా కర్మాగారాం నుంచి మాకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు.. అంగూల్(ఒడిశా) నుంచి ప్రాణవాయువు సరఫరా చేయాలని కోరింది."
- సునీత్ అరోరా, రైల్వే బోర్డు ఛైర్మన్