తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పదేళ్లు పైబడిన వాహనాలు రోడ్డెక్కడం నిషేధం'​

వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం.. నగరంలో (Delhi Pollution News) పలు ఆంక్షలు విధించింది. అత్యవసర సేవలు మినహా దిల్లీలోకి ఏ వాహనాన్నీ అనుమతించమని స్పష్టం చేసింది. 10 ఏళ్లు పైబడిన డీజిల్​ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్​ వాహనాల​ రాకపోకలు నిలిపివేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

Delhi Pollution News
'పదేళ్లు పైబడిన వాహనాలు రోడ్డెక్కడానికి వీలు లేదు'​

By

Published : Nov 17, 2021, 3:55 PM IST

వాయుకాలుష్యం తారస్థాయికి చేరిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం (Delhi Pollution News) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నగరంలో పలు ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పాఠాశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

నిర్మాణ, కూల్చివేత పనులను (Delhi Pollution News) ఆదివారం వరకు నిలివేయడం సహా ప్రభుత్వోద్యోగులకు వర్క్​ఫ్రమ్​ హోం కల్పిస్తున్నట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్​ రాయ్​ బుధవారం ప్రకటించారు.

గోపాల్​ రాయ్​ ప్రెస్​మీట్​ హైలైట్స్​:

  • అత్యవసర సేవలు మినహా దిల్లీలోకి ఏ వాహనాన్నీ అనుమతించట్లేదు. ఈ దిశగా పోలీస్​, రవాణా శాఖలు కృషి చేయనున్నాయి.
  • ప్రజా రవాణాను పెంచేందుకు 1000 ప్రైవేట్​ సీఎన్​జీ బస్సులను దిల్లీ ప్రభుత్వం అద్దెకు తీసుకోనుంది. గురువారం ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మెట్రో రైళ్లలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్​ ఆంక్షల సడలింపును కూడా దిల్లీ ప్రభుత్వం పరిశీలించనుంది.
  • 10 ఏళ్లు దాటిన డీజిల్​ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్​ వాహనాల రాకపోకలను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్​ పంప్​ల వద్ద పొల్యూషన్ చెక్​లను మరింత కట్టుదిట్టం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
  • ప్రస్తుతం 372 వాటర్​ స్ప్రింక్లర్​లను ఏర్పాటు చేయగా.. అగ్నిమాపక శాఖ సాయంతో మరో 13 హాట్​స్పాట్​లలో వాటర్​ స్ప్రింక్లర్​లను అందుబాటులోకి తేనుంది.
  • పరిశ్రమలకు మాత్రమే ​గ్యాస్​ వినియోగానికి అనుమతించింది. కలుషిత ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇదీ చూడండి :తల్లడిల్లిపోయిన గజరాజులు.. బుల్లి ఏనుగు ప్రాణాలతో లేదని తెలియక...

ABOUT THE AUTHOR

...view details