తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​లో లెక్కింపు ఆలస్యం- తుది ఫలితంపై ఉత్కంఠ - బిహార్ ఎన్నికల ఫలితాలు

బిహార్​ ఎన్నికల ఫలితాల్లో ఎన్​డీఏ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. రెండు కూటముల మధ్య పోరు ఉత్కంఠగా సాగుతోంది. ఎన్​డీఏ, మహాకూటమి​ నడుమ స్వల్ప తేడా ఉండటం, ఇంకా 75 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Bihar results
బిహార్​

By

Published : Nov 10, 2020, 2:17 PM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ ముందంజలో కొనసాగుతోంది. అయితే, మహాకూటమితో పోలిస్తే ఎన్​డీఏ స్వల్ప ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో తుది ఫలితం ఏంటన్నది ఆసక్తిగా మారింది.

25 శాతమే పూర్తి..

బిహార్​లో మొత్తం పోలైన ఓట్లు 4.10 కోట్లు కాగా.. ఇప్పటివరకు 25 శాతం ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తయింది. ఇంకా చాలా ఓట్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

స్వల్ప ఆధిక్యం..

అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదు. కొంతమంది ​జేడీయూ కీలక నేతలూ వెనుకంజలో ఉండటం ఇందుకు బలం చేకూర్చుతోంది. ఈ సారి బిహార్​లో మహాకూటమికే ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేశాయి.

లెక్కింపు ఆలస్యం..

కరోనా నిబంధనలకు అనుగుణంగా బిహార్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచారు. గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా 63 శాతం ఈవీఎంలను వినియోగించారు. సాధారణంగా బిహార్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు 25-26 రౌండ్లలో పూర్తయ్యేది. కానీ, ఈ సారి 35 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రికి పూర్తి ఫలితాలు తేలనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చూడండి:బిహార్​లో కమలనాథుల కల నెరవేరేనా?

ABOUT THE AUTHOR

...view details