తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్మ అవార్డు గ్రహీతల ఎంపికకు ఇక కొత్త పద్ధతి - పద్మ అవార్డ్స్.గవ్.ఇన్

మరుగున పడిపోయిన నిజమైన హీరోలను కనుగొని వారికి పద్మ అవార్డులు అందించేందుకు కృషి చేయాలని.. అందుకు ప్రత్యేక సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం. వివిధ మార్గాల్లో సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న అనేక మంది సామాన్యులను నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పద్మ అవార్డులతో సత్కరిస్తోంది.

PADMA AWARDS
పద్మ అవార్డులు

By

Published : Jun 4, 2021, 6:15 PM IST

పద్మ అవార్డులకు అర్హులైన, ప్రతిభావంతులైన వ్యక్తులను అన్వేషించేందుకు ప్రత్యేక సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. ఆయా రంగాల్లో, క్షేత్రస్థాయిలో అసాధారణ కృషి చేసినప్పటికీ వెలుగులోకి రాని ప్రతిభావంతులను పద్మ అవార్డులకు నామినేట్ చేయాల్సిందిగా కేంద్రం సూచించింది.

"వాస్తవానికి ఇలాంటి వ్యక్తులను ప్రజలు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే వారు ప్రజల దృష్టిని ఆరర్షించడం కన్నా.. వారి పనిమీదే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అందువల్ల అర్హత ఉన్న వ్యక్తులను గుర్తించి.. వారి విజయాలను ప్రపంచానికి తెలియజెప్పేందుకు నామినేషన్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అటువంటి వ్యక్తులకు దక్కే గుర్తింపు అవార్డుల ప్రతిష్ఠను మరింత పెంచుతుంది."

-ఆర్​కే సింగ్, హోం శాఖ సంయుక్త కార్యదర్శి

గణతంత్ర వేడుకల్లో ప్రదానం..

జూన్ 1-సెప్టెంబర్ 15 మధ్య కాలంలో padmaawards.gov.inలో దరఖాస్తుల స్వీకరణకు కేంద్రం నోటిఫికేషన్​ను జారీచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపింది. 2022 గణతంత్ర వేడుకల సందర్భంగా వీటిని ప్రకటించనున్నారు.

వివిధ మార్గాల్లో సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న అనేక మంది సామాన్యులను నరేంద్ర మోదీ ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తోంది.

పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. జాతి, వృత్తి, ప్రాంతం, లింగ భేదం లేకుండా ఈ అవార్డులకు అందరూ అర్హులే. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు.. కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు స్వయంగా పద్మ అవార్డులకు నామినేషన్లు పంపవచ్చు.

ఇవీ చదవండి:శెభాష్​ అనిపించుకున్నారు- పద్మాలు సాధించారు!

ప్రపంచ బ్యాంకుకు సలహాదారుడిగా 'మహో'పాధ్యాయుడు!

ABOUT THE AUTHOR

...view details