Rahul Gandhi: ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్కి చెందిన ఓ మహిళ.. తన ఆస్తినంతా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరుపై రాసిచ్చింది. నగరంలోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్ కుమార్తె పుష్పమంజీలాల్ తన పేరుపై ఉన్న మొత్తం ఆస్తులను రాహుల్ గాంధీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన వీలునామా పత్రాలను కోర్టులో సమర్పించింది. రాహుల్ గాంధీ ఆలోచనలు తనను బాగా ప్రభావితం చేశాయని.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి నేటి వరకు గాంధీ కుంటుంబం అత్యున్నత త్యాగాలను చేసిందని తెలిపింది.
రాహుల్‌పై అభిమానం.. రూ.లక్షల ఆస్తిని రాసిచ్చిన మహిళ - రాహుల్ గాంధీ న్యూస్
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి తన ఆస్తినంతా రాసిచ్చింది దెహ్రాదూన్కి చెందిన ఓ మహిళ. తన తదనంతరం రాహుల్‌కు ఆస్తి దక్కేలా వీలునామాను కోర్టుకు సమర్పించింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రభావితమయ్యే తన ఆస్తికి వారసుడిగా ఎంపికచేసినట్లు మహిళ తెలిపింది. ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలు సహా ఇతర పత్రాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్సింగ్కు అందజేసినట్లు ఆ పార్టీ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ తెలిపారు. తన తదనంతరం ఆస్తి మొత్తాన్ని రాహుల్ గాంధీకి అప్పగించాలని పుష్ప.. కోర్టును అభ్యర్థించింది. ఈమె పేరుపై రూ.50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, 10 తులాలల బంగారం ఉన్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రులుగా సేవలందించారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండగా.. ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు
ఇదీ చదవండి:ఆధార్ కార్డులోని పేరు తెచ్చిన చిక్కు.. స్కూల్ అడ్మిషన్ తిరస్కరణ!