తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు జర్మనీ ఆక్సిజన్ సాయం! - రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

కరోనా 2.0 విజృంభణతో దేశవ్యాప్తంగా ప్రాణవాయువు కొరత ఏర్పడిన వేళ.. దాన్ని అధిగమించేందుకు రక్షణ శాఖ ముందడుగేసింది. విదేశాల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను తీసుకురావాలని నిర్ణయించింది. తొలుత.. జర్మనీ నుంచి 23 సంచార ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

Defence Ministry
రక్షణ మంత్రిత్వ శాఖ

By

Published : Apr 23, 2021, 6:12 PM IST

దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో మెడికల్​ ఆక్సిజన్​కు కొరత ఏర్పడిన నేపథ్యంలో.. రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జర్మనీ నుంచి 23 సంచార ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను భారత్​కు తీసుకురావాలని నిర్ణయించింది. మరో వారం రోజుల్లో వీటిని విమానాల ద్వారా దేశానికి తరలించనున్నారు. ఈ ప్లాంట్లను కొవిడ్​ రోగులకు చికిత్స అందించే సైనిక దళాల ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు.

ఒక్కో సంచార ఆక్సిజన్​ కేంద్రం నిమిషానికి 40 లీటర్ల ప్రాణవాయవును ఉత్పత్తి చేయగలదు. ఈ కేంద్రాల తరలింపునకు సంబంధించి అధికారిక ప్రక్రియ పూర్తవగానే వాటిని తీసుకొచ్చేందుకు వీలుగా రవాణా విమానాలను సిద్ధం చేసి ఉంచాలని వైమానిక దళానికి రక్షణ శాఖ సూచించింది. విదేశాల నుంచి ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలను మరిన్ని కొనుగోలు చేస్తామని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:''ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్'​ కోసం దిల్లీ, ఏపీ​ అభ్యర్థన'

ABOUT THE AUTHOR

...view details