Procurement Of Military Platforms: త్రివిధ దళాలను మరింత ఆధునీకరించడంలో భాగంగా రూ. 8వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్, జీశాట్-7బీ శాటిలైట్ సహా రూ. 8,357 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డీసీఏ సమావేశంలో ఆమోదం లభించింది.
వీటి ద్వారా త్రివిద దళాల్లో మెరుగైన సమాచార వ్యవస్థతో పాటు శత్రు విమానాలను త్వరితగతిన గుర్తింపు వంటి సామర్థ్యం పెరుగుతుందని రక్షణశాఖ వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రేరణగా ఈ ఉత్పత్తులన్నీ దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదనలను భారత్‌లో రూపకల్పన, అభివృద్ధి, తయారీ ఐడీఏఎం విభాగం కింద కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.