Rajnath Singh Corona: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హోం క్వారెంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.
ఐదు రోజుల క్రితం రాజ్‌నాథ్.. వాయుసేన అధికారులతో సమావేశమయ్యారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ చీఫ్.. రాజ్‌నాథ్‌ను కలిసి నివేదిక సమర్పించారు.
బిహార్ సీఎంకు..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా వైరస్ బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు హోం క్వారెంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
కర్ణాటక సీఎంకు..
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తెలినట్లు తెలిపారు. తాను ఆరోగ్యం బాగుందని.. స్వీయనిర్భందంలో ఉన్నట్లు సీఎం బొమ్మై ట్వీట్ చేశారు.