మూడు రోజుల లద్దాఖ్ పర్యటనలో భాగంగా సోమవారం.. సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ(బీఆర్ఓ) నిర్మించిన 63ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. లద్దాఖ్ అభివృద్ధిపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
"దేశాభివృద్ధిలో కనెక్టివిటికీ చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలోని చాలా ప్రాంతాలను కలపటంలో బీఆర్ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తీవ్రవాదం, సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో వెనకబడటం లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయటం వెనకున్న కారణాల్లో ముఖ్యమైనవి. యూటీగా మారిన తర్వాత ఉగ్రవాద చర్యలు తగ్గాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు, మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్రం చాలా చేస్తోంది. "
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి