పార్టీ ఫిరాయింపుల కారణంగా బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ధీమా వ్యక్తంచేశారు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ. అమిత్ షా ఆధ్వర్యంలో శనివారం కొందరు అధికార పార్టీ నేతలు భాజపాలో చేరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ఫిరాయింపుదారుల విషయానికి తృణమూల్ పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వదని తెలిపారు ముఖర్జీ. 'వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 294 ఎమ్మెల్యే సీట్లకు గానూ.. 250 స్థానాల్లో భాజపా విజయం సాధిస్తోంది' అన్న అమిత్ షా మాటలు బూటకమని అన్నారు.
"సువేందు అధికారి పార్టీ మారటంఏమీ విస్మయానికి గురి చేయలేదు. ఆయన ముందు నుంచే భాజపాతో సన్నిహితంగా ఉండడం మాకు తెలుసు. ఇలాంటి వెన్నుపోటు చర్యలు తృణమూల్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టలేవు. భాజపా నేతలు 250 స్థానాలు గెలుస్తామని బీరాలు పలుకుతున్నారు. ఫ్లెక్సీల విషయంలో భాజపా నాయకులు రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించారు."