తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎర్రకోట ఘటన' కేసులో దీప్​ సిద్ధూ అరెస్ట్​ - దిల్లీ హింస

deep-sidhu
'ఎర్రకోట ఘటన' కేసులో దీప్​ సిద్ధూ అరెస్ట్​

By

Published : Feb 9, 2021, 9:19 AM IST

Updated : Feb 9, 2021, 12:21 PM IST

09:16 February 09

'ఎర్రకోట ఘటన' కేసులో దీప్​ సిద్ధూ అరెస్ట్​

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్​ నటుడు దీప్​ సిద్ధూను దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్​ చేశారు. చండీగఢ్, అంబాలా మధ్యలోని జిరాక్‌పుర్‌ ప్రాంతంలో సిద్ధూను అరెస్టు చేసినట్లు తెలిపారు. 

కాలిఫోర్నియాలో నివసిస్తోన్న తన స్నేహితురాలు, నటితో దీప్​ సిద్ధూ కాంటాక్ట్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ వీడియోలు చేస్తూ ఆమెకు పంపిస్తుండగా.. వాటిని సదరు నటి తన ఫేస్​బుక్ పేజీ​లో అప్​లోడ్​ చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

రిపబ్లిక్​ డే రోజు.. రైతుల ట్రాక్టర్​ పరేడ్​ సందర్భంగా ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఆ ఘటనలపై స్థానిక పోలీసులు, ప్రత్యేక విభాగం, క్రైమ్​ విభాగం పోలీసులు మూడు స్థాయుల్లో దర్యాప్తు చేపట్టారు. పంజాబ్​ నటుడు దీప్​ సిద్ధూ, గ్యాంగ్​స్టర్​ లఖా సిధానాల పేర్లను ఎఫ్​ఐఆర్​లో చేర్చారు. సిద్ధూ ఈ ఘటనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'నేను విచారణకు హాజరవుతా.. కానీ'

Last Updated : Feb 9, 2021, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details