Film Director Arrested: మలయాళ సినీ పరిశ్రమకు చెందిన యువ డైరెక్టర్ లిజు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని కన్నూర్‌లో జరిగిందీ ఘటన. తనపై అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ఆరోపించిన నేపథ్యంలో.. షూటింగ్ లొకేషన్లోనే ఆదివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ దర్శకుడిని కొచికి తరలించి.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.
2020 డిసెంబర్ నుంచి 2021 జూన్ మధ్య బాధితురాలిపై పలుమార్లు.. డైరెక్టర్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఫిర్యాదు మేరకు కృష్ణపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
లిజు కృష్ణ ప్రస్తుతం 'పాడవేట్టు' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నటుడు సన్నీ వేన్ నిర్మాత. కృష్ణ అరెస్టుతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.