13 People Died Across the State Due to Chandrababu Arrest:చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన సమాచారం తెలుసుకొని కార్యకర్తలు తల్లడిల్లిపోయారు. శనివారం మొదలు.. ఆదివారం రోజంతా ఉత్కంఠగా సాగిన కోర్టు తంతుతో శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. కోర్టు పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విచారణ ప్రక్రియను ప్రసార మాధ్యమాల్లో తెలుసుకుంటూ తీవ్ర ఆందోళన చెంది రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారు.
Guntur District:గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి శివారు రేగులగడ్డకు చెందిన నల్లజర్ల పెద్ద చెన్నకేశవరావు చంద్రబాబు అరెస్టు వార్త తెలుసుకుని ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి కుర్చీలోనే ఒరిగి, అలాగే మృతిచెందారు. చెన్నకేశవరావు టీడీపీ పాలనలో పదేళ్ల పాటు రేగులగడ్డ సంగం డెయిరీ పాలకేంద్రం అధ్యక్షుడిగా, బేతపూడి సొసైటీ డైరెక్టర్‌గా, వార్డు సభ్యుడిగా, టీడీపీ గ్రామ అధ్యక్షుడిగా పని చేశారు.
Live Updates: చంద్రబాబు రిమాండ్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
Nellore District:నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం టెంకాయచెట్లపాలేనికి చెందిన వాయల సుందరరావు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.అనంతరం ఇంటికెళ్లి టీవీలో వార్తలు చూస్తూ.. మనస్తాపానికి గురయ్యారు. అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Vizianagaram District:విజయనగరం జిల్లాలో చంద్రబాబు అరెస్టు వార్త విని ఇద్దరు మరణించారు. పట్టణంలోని 23వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోరాడ అప్పారావు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. తెర్లాం మండలం మోదుగువలసకు చెందిన జి.అప్పారావు శనివారం రాత్రి పొలం నుంచి వచ్చి చంద్రబాబు అరెస్టు వార్తలు విని ఆందోళనకు గురై చనిపోయారు.
Amaravati:అమరావతి మండలం లింగాపురంలో తెలుగుదేశం అభిమాని అభిమాని సరిపూడి కోటేశ్వరరావు చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు.
Nandyala District:నంద్యాల జిల్లా మిడుతూరు మండలం నాగలూటి గ్రామానికి చెందిన చిన్నమాసుం చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు.