బిహార్‌లో కల్తీ మద్యం(Poisonous Liquor) ఘటనలో మృతుల సంఖ్య(illicit liquor death) రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 33కు చేరింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని మహ్మద్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 మంది చనిపోగా.. పశ్చిమ చంపారన్ జిల్లాలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కల్తీ మద్యం (Poisonous Liquor) విక్రయాలను అరికట్టడంలో విఫలమైన మహ్మద్‌పుర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.