తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకిల్​పై వెళ్తూ డ్రైనేజీలో పడ్డ బాలిక.. 2 గంటల రెస్క్యూ ఆపరేషన్​.. చివరకు... - గుజరాత్ విస్​నగర్ న్యూస్

మురుగు నీటి కాల్వలో పడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. మున్సిపల్ అధికారులు రెండు గంటలపాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా ఫలితం లేకపోయింది.

baby fall in drainage
మురుగు కాల్వలో పడిపోయిన బాలిక

By

Published : Aug 6, 2022, 1:26 PM IST

మురుగు కాల్వలో పడిపోయిన బాలిక

గుజరాత్ మెహ్సానా జిల్లాలో దారుణం జరిగింది. సైకిల్ మీద వెళ్తున్న ఏడేళ్ల బాలిక అదుపు తప్పి డ్రైనేజీలో పడిపోయింది. సమాచారం అందుకొని వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన మున్సిపల్ అధికారులు.. రెండు గంటల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్నారు. బాలికను బయటకు తీసి హుటాహుటిన విస్​నగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఎటువంటి ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాధితురాలు చనిపోయింది. ఈ ఘటన విస్​నగర్​లోని శుకాన్​ హోటల్ సమీపంలో శుక్రవారం జరిగింది.

మురుగు కాల్వలో పడిపోయిన బాలిక

మున్సిపల్ సిబ్బంది శక్తివంచన లేకుండా పనిచేసినప్పటికీ బాలికను కాపాడలేకపోయారు. ఈ రెస్క్యూ ఆపరేషన్​లో మూడు జేసీబీలను ఉపయోగించారు. రోడ్లను సైతం తవ్వి నీటిని దారి మళ్లించారు. అప్పటికే ఘటనా స్థలంలో స్థానికులు గుమిగూడారు. మెహ్సానా జిల్లాలో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి రోడ్లు జలమయమయయ్యాయి.

మురుగు కాల్వలో పడిపోయిన బాలిక

రాష్ట్ర ఆరోగ్య మంత్రి, వీస్​నగర్ ఎమ్మెల్యే రిషికేశ్​ పటేల్ నివాసానికి సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. బాలిక మృతదేహానికి సివిల్ ఆసుపత్రి వైద్యులు పోస్టు మార్టం పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య మంత్రి రిశికేష్ పటేల్ బాలిక మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మురుగు కాల్వలో పడిపోయిన బాలిక

ఇవీ చదవండి:కడుపులో స్టీల్ గ్లాస్​.. గంటసేపు వైద్యుల సర్జరీ.. అంత పెద్దది లోపలికెలా వెళ్లిందో!

జైళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్.. ఖైదీలకు డోప్ టెస్టులు.. అధికారులు షాక్

ABOUT THE AUTHOR

...view details