తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిచ్చుకకు సమాధి.. దశదిన కర్మ.. గ్రామస్థులందరికీ భోజనాలు!

death ceremony of sparrow: ఊరంతా కలిసి ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. సమాధి కట్టించారు. శాస్త్రోక్తంగా దశదిన కర్మ జరిపించి, చుట్టుపక్కల ప్రజలందరికీ భోజనాలు పెట్టారు. కానీ.. ఇదంతా చేసింది ఓ పిచ్చుక కోసం కావడం విశేషం.

By

Published : Feb 8, 2022, 9:00 PM IST

death ceremony of sparrow
death ceremony of sparrow

death ceremony of sparrow: కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లా శిద్లగట్ట మండలం బసవనపట్టణ గ్రామంలో మంగళవారం అరుదైన కార్యక్రమం జరిగింది. ఊరంతా కలిసి ఓ పిచ్చుకకు దశదిన కర్మ జరిపించి, భోజనాలు పెట్టారు.

పిచ్చుకకు శ్రద్ధాంజలి

sparrow death karnataka

బసవనపట్టణ గ్రామంలో చాలా పిచ్చుకలు ఉంటాయి. అయితే.. ఒకటి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎప్పుడూ అది ఊరి ముఖద్వారం వద్ద ఉండేది. ఏదైనా పనిపై ఊరు దాటేవారంతా దానిని చూసి వెళ్లేవారు. పని అయిపోయి తిరిగొచ్చేటప్పుడు మళ్లీ దానిని ఓసారి చూసి.. ఇళ్లకు చేరేవారు. అయితే... కొద్దిరోజుల క్రితం ఆ పిచ్చుక కనిపించకుండా పోయింది. 11 రోజుల క్రితం ఓ చోట శవమై కనిపించింది.

పిచ్చుక మరణించిన తేదీని ముద్రించి...

పిచ్చుకతో అనుబంధం పెంచుకున్న గ్రామస్థులు.. దానికి ఘనంగా అంత్యక్రియలు చేశారు. 'తిరిగి రా' అంటూ శ్రద్ధాంజలి పోస్టర్లు వేయించారు. సమాధి కట్టించారు. మంగళవారం దశదిన కర్మ జరిపించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భారీ మొత్తంలో వంటలు చేయించారు. చుట్టుపక్కల వారందరినీ పిలిపించి భోజనాలు పెట్టారు. పక్షుల్ని సంరక్షించాలని వచ్చినవారందరినీ కోరారు.

గ్రామస్థుల పూజలు

ఇదీ చదవండి:రాజు పటేల్.. భారత దేశపు తొలి 'డిజిటల్ బెగ్గర్​'!

ABOUT THE AUTHOR

...view details