కాలక్షేపం కోసమో లేక సరాదా కోసమో ప్రారంభించిన మొబైల్ గేమింగ్.. పుదుచ్చేరిలో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ ఇంటర్ విద్యార్థి.. నిత్యం ఆటలాడుతూ.. వాటికి బానిసగా మారి.. చివరకు మృతిచెందాడు.
ఇదీ జరిగింది..
విల్లివయానూర్లోని మానవేలికి చెందిన దర్శన్(16).. గత కొద్ది రోజులుగా ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడ్డాడు. ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా మొబైల్‌కు బానిసయ్యాడట దర్శన్. ఎంతగా అంటే.. కనీసం టైంకు తిండి, నీరు కూడా తీసుకోలేనంతగా. ఇలా.. మంగళవారం రాత్రి ఏకధాటిగా నాలుగు గంటలపాటు ఆన్లైన్ గేమ్(ఫైర్ వాల్) ఆడిన ఆ బాలుడు.. ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు.