తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కటైన బధిర జంటలు.. అంగరంగ వైభవంగా వివాహం - బధిరుల వివాహం

Deaf And Dumb Marriage Jaipur: రెండు బధిర జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. వినికిడి సమస్య ఉన్న సోదరులను బధిర అక్కాచెల్లెళ్లు పెళ్లిచేసుకున్నారు. ప్రత్యేక పదాలు, సైగలతో పెళ్లి పూర్తి చేశారు ఖ్వాజీ.

deaf and dumb marriage
ఒక్కటైన బధిర జంట

By

Published : Dec 15, 2021, 5:26 PM IST

ఒక్కటైన బధిర జంటలు

Deaf And Dumb Marriage Jaipur: రాజస్థాన్ జైపుర్​కు చెందిన రెండు బధిర జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి. ఇద్దరు బధిర సోదరులు.. తమలాగే మూగ, వినికిడి సమస్య ఉన్న అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. జైపుర్​లోని జగదీశ్ కాలనీలో ఈ వివాహం జరిగింది.

వివాహ కార్యక్రమంలో బధిర అక్కాచెల్లెళ్లు
బధిర సోదరుల సంతోషం

స్నేహితులు, బంధువులు పాల్గొని జంటలకు సహకారం అందించారు. రాజస్థానీ పద్ధతిలో వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిచారు కుటుంబసభ్యులు.

ఖ్వాజీ ఆధ్వర్యంలో..

నలుగురికీ మూగ, వినికిడి సమస్య ఉండటం వల్ల పెళ్లి మంత్రాలు, ఇతర కార్యక్రమాలను ప్రత్యేక పదాలు, సైగలతో పెళ్లి ముగించారు ఖ్వాజీ. వీరికి వివాహం చేయడం కష్టతరంగా అనిపించిందన్నారు ఖ్వాజీ. ఇరువురి ఇష్టప్రకారమే వివాహం జరిపించినట్లు తెలిపారు.

పెళ్లిలో రాజస్థానీ వేషధారణలో సోదరులు
పెళ్లి మంత్రాలను సైగలతో వివరిస్తున్న ఖ్వాజీ
ప్రత్యేక సైగలు చేస్తున్న ఖ్వాజీ

వీరంతా ఇదివరకు ఒకే పాఠశాలకు చెందినవారని వివరించారు. వీరి వివాహానికి 50మందికి పైగా వధూవరుల స్నేహితులు హాజరై సందడి చేశారు.

ఇదీ చూడండి:సొంత చెల్లినే వివాహమాడిన అన్న.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details