మృత్యువు అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగివచ్చాడు. ఆగిపోయిందనుకున్న అతని గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా మహాలింగపురలో గత నెల 27న జరిగింది.
చనిపోయాడు అనుకుని..

గత నెల 27న మహాలింగపుర - రబాకవి మార్గంలో ద్విచక్రవాహనం మీద ప్రయాణిస్తున్న శంకర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు బెల్గాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే శంకర్ బతికే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఆ ఆస్పత్రి వైద్యులు తేల్చిచెప్పేశారు. దీంతో అతడిని మహాలింగపుర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతనిలో ఎలాంటి చలనం లేకపోవడం వల్ల మార్గమధ్యంలోనే మృతిచెందాడని అందరూ భావించారు.
ఇదే విషయాన్ని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కూడా ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టమ్‌కు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక కాసేపట్లో పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తారనగా అతని కాళ్లలో కదలిక వచ్చింది. ఇది గమనించిన వైద్యులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించమని సూచించారు. ప్రస్తుతం శంకర్ చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి :'పోర్టులపై రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు'