తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానసిక రోగుల ఆహారంలో ఎలుక.. ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యం! - రోగి ఆహారంలో ఎలుక

Dead Rat in patients food: మానసిక రోగులకు అందించిన ఆహారంలో చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ ఘటన ఝార్ఖండ్​ రాంచీలోని రిన్​పస్​ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనిపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

dead Rat in patients food
dead Rat in patients food

By

Published : Aug 6, 2022, 1:11 PM IST

Dead Rat in patients food: ఝార్ఖండ్​లోని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి అడ్డాలుగా మారిపోతున్నాయి. రోగులకు అందించిన ఆహారంలో చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ ఘటన మానసిక రోగులకు చికిత్స అందించే రిన్​పస్​ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనిపై ఆస్పత్రి డైరెక్టర్​ జయతి సిమ్లయిని సంప్రదించగా.. దీనికి కారకులైన వారిని గుర్తించామని.. కంకే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆస్పత్రి పేరును చెడగొట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు సైబర్​ పోలీసులకు సైతం సమాచారం అందించామని పేర్కొన్నారు.

వంట గిన్నెలో చనిపోయిన ఎలుక

రిన్​పస్​ ఆస్పత్రి మానసిక రోగులకు చికిత్సను అందిస్తోంది. ఇలాంటి రోగులకు సరైన ఆహారం అందించాల్సి ఉంటుంది. మానసిక రోగులకు అందించే ఆహారంలో చనిపోయిన ఎలుక రావడం పట్ల రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల ఆరోగ్యం పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details