ఛత్తీస్‌గఢ్‌లోని కోర్భాలో ఓ వింత ఘటన జరిగింది. మద్యం సీసాలో చనిపోయిన కప్ప కనిపించింది. ఈ ఘటనపై మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి.. దుకాణం నిర్వాహకుడికి ఫిర్యాదు చేయగా అతడు వినియోగదారుడికి వేరే మద్యం బాటిల్‌ను ఇచ్చాడు.
ఇదీ జరిగింది..
హార్దిబజార్లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఓ యువకుడు మద్యం కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ ఓపెన్ చేసేసరికి లోపల చనిపోయిన కప్ప కనిపించింది. ఆ తర్వాత వైన్ షాపునకు వెళ్లి సేల్స్మ్యాన్కు ఫిర్యాదు చేశాడు. ఇంతలో జనం గుమిగూడి మద్యం నాణ్యతపై ప్రశ్నించారు. గోదాం నుంచి మద్యం వస్తుందని.. తనిఖీ చేసి వినియోగదారులకు ఇస్తామని వైన్ షాపు నిర్వాహకుడు అమిత్ రాఠోడ్ తెలిపాడు. ఇలాంటి ఘటన ఇంతకుముందు జరగలేదని అన్నాడు.