మహిళా కానిస్టేబుల్, ఆమె తల్లి, కూతురు పోలీసు క్వార్టర్స్‌లోనే అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం రేపింది. ఈ ఘటన ఝూర్ఖండ్ జంషెద్‌పుర్‌లో జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే:సవితా రాణి, ఆమె తల్లి లఖియా, పదేళ్ల కుమార్తె గోల్మురి పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఎస్పీ ఆఫీసులో సవితా రాణి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త నక్సల్ దాడిలో మరణించడం వల్ల ఆమెకు ఈ ఉద్యోగం కారుణ్య నియామకం కింద వచ్చింది. మంగళవారం నుంచి సవితా విధులకు హాజరుకావట్లేదు. రెండు రోజుల నుంచి ఇంటి బయట నుంచి తాళం వేసి ఉంది. సవితా ఇంటిలోపలి నుంచి దుర్వాసన రావడం వల్ల ఇరుగుపొరుగు వారు పోలీసులకు గురువారం సమాచారం అందించారు. పోలీసులు లోపలికి చేరుకుని మూడు మృతదేహాలను గుర్తించారు.
ఉద్యోగం ఇప్పిస్తానని:రాజస్థాన్ బాడ్మేర్లో ఘోరం జరిగింది. మంత్ర విద్యతో ఉద్యోగం ఇప్పిస్తానని చెబుతూ 27 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాంత్రికుడు. అసభ్యకర వీడియోలను తీసి బాధితురాల్ని బ్లాక్మెయిల్ చేసి గతేడాదిగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు నిందితుడు చంపాలాల్. బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.