తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంగాజలం పోయగానే కళ్లు తెరిచి మాట్లాడిన శవం!

Dead body gets alive: చితిపై ఉంచిన ఓ వృద్ధుడి మృతదేహం.. అంత్యక్రియలకు కొద్దిక్షణాల ముందు కళ్లు తెరిచింది. హఠాత్​ పరిణామంతో ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు.. వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే...?

dead body gets alive
dead body gets alive

By

Published : Dec 27, 2021, 12:59 PM IST

Updated : Dec 27, 2021, 1:05 PM IST

చితిపై ఉన్న శవం.. కళ్లు తెరిచి...

Dead body alive Delhi: దిల్లీ సమీపంలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. కొద్ది క్షణాల్లో అంత్యక్రియలు జరుగుతాయనగా.. చితిపై ఉంచిన మృతదేహం కళ్లు తెరిచింది. వృద్ధుడు మరణించినట్లు వైద్యులు తప్పుగా ధ్రువీకరించడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

Dead man in India comes alive

సతీష్ భరద్వాజ్(62) అనే వ్యక్తి క్యాన్సర్​తో బాధపడుతూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. సోమవారం వేకువజామున బాధితుడు తుదిశ్వాస విడిచాడని ఆస్పత్రి వర్గాలు.. కుటుంబ సభ్యులకు తెలిపాయి. ఏకంగా 11 మంది డాక్టర్లు బాధితుడి మృతిని నిర్ధరించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు వృద్ధుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లారు. చితికి నిప్పంటించే ముందు వృద్ధుడి నోట్లో గంగాజలం పోశారు. అంతే.. శవం కదిలినట్లు కనిపించింది. వృద్ధుడు నెమ్మదిగా కళ్లు తెరిచాడు. అనంతరం మాట్లాడాడు కూడా.

కళ్లు తెరిచిన వృద్ధుడు

ఈ పరిణామంతో షాక్​కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. దిల్లీ పోలీసులకూ సమాచారం అందించారు. వృద్ధుడిని నరేలాలోని రాజా హరిశ్చంద్ర ఆస్పత్రిలో చేర్చారు. వృద్ధుడి బీపీ, పల్స్​ రేట్, హార్ట్​బీట్ నార్మల్​గానే ఉన్నాయని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఎల్​ఎన్​జేపీ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి తరలింపు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందా అని ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:విద్యార్థి ఆత్మహత్య.. శవాన్ని తీసుకెళ్లలేమన్న తల్లిదండ్రులు- ఎందుకంటే?

Last Updated : Dec 27, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details