Dead Body in Ruined Home: కర్ణాటకలో ఏడాదిగా ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన ఓ ఇంట్లో మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. చిక్కమంగళూరు జిల్లాలోని కొప్పా పట్టణంలో ఈ ఘటన జరిగింది.
ఏడాది క్రితం ఆ ఇంట్లో 'ఆత్మహత్య'.. ఇప్పుడు తలుపు తెరవగానే... - Dead Body in Ruined Home
Dead Body in Ruined Home: ఏడాదిగా ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కర్ణాటక చిక్కమంగళూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
జిల్లాలో చంద్రమోహన్‌కు కొప్పా పట్టణంలోని టీఎమ్ రోడ్లో జయలక్ష్మీ హాల్ పేరుతో ఓ ఇల్లు ఉంది. ఏడాదిగా అందులో ఎవరూ ఉండట్లేదు. శిథిలమైన ఆ ఇంటికి మరమ్మతు చేయించాలని ఇటీవల భావించాడు చంద్రమోహన్. ఇంటి తలుపులు తెరవగా.. ఓ మృతదేహం ఆనవాళ్లు లభించాయి. భయంతో చంద్రమోహన్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ఏడాది క్రితమే గుర్తుతెలియని వ్యక్తి ఘటనా స్థలంలో ఆత్మహత్య చేసికుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:దిగ్గజ కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూత