తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంగానదిలో మూడు రోజులుగా కొట్టుకొస్తున్న మృతదేహాలు - మృతదేహాల ప్రవాహం

ఉత్తర్​ప్రదేశ్​లోని వివిధ ప్రాంతాల్లో గంగానదిలో మృతదేహాలు కొట్టుకురావటం మూడురోజులుగా కొనసాగుతూనే ఉంది. బుధవారం గాజీపుర్​ జిల్లాలో మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. బలియా జిల్లాలో మరో 7 మృతదేహాలు కనిపించాయి.

dead bodies in ganga
గంగా నదిలో కొనసాగుతున్న మృతదేహాల ప్రవాహం!

By

Published : May 12, 2021, 8:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గంగానదిలో మూడు రోజులుగా మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. గాజీపుర్​ జిల్లా గాహ్మర్​ ప్రాంతంలోని పంచముఖి ఘాట్​లో బధవారం మరో మూడు నుంచి నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనపై గాజీపుర్​ జిల్లా మేజిస్ట్రేట్​ మంగళ ప్రసాద్​ను 'ఈటీవీ భారత్'​ సంప్రదించింది. అయితే.. ఒక్క మృతదేహాన్ని మాత్రమే తాము స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. కానీ, జిల్లా అధికారులు, స్థానిక అధికారులు కలిసి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎన్నో మృతదేహాలను బయటకు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80 మృతదేహాలను గంగా నది నుంచి అధికారులు బయటకు తీశారన్నారు.

ఈ మృతేదేహాల విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎస్​డీఎం రమేష్​ కుమార్​ తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు, అంత్యక్రియలు చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

బలియా జిల్లాలో...

మరోవైపు బలియా జిల్లాలో మరో 7 మృతదేహాలు గంగా నదిలో తేలియాడుతూ కనిపించాయి. ఈ మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు బలియా జిల్లా​వ్యాప్తంగా గంగా నదిలో కనిపించిన మృతదేహాల సంఖ్య 52కు చేరిందని ఓ అధికారి తెలిపారు. ఉజియార్​, కుల్హాదియా, భారౌలీ ఘాట్​ల వద్ద మంగళవారం సాయంత్రం.. 45 మృతదేహాలు కనిపించాయని బలియా స్థానికులు తెలిపారు.

బలియా-బక్సార్​ వంతెన కింద కొన్ని మృతదేహాలు కుళ్లినస్థితిలో కనిపించాయని బలియా జిల్లా మేజిస్ట్రేట్​ అదితీ సింగ్​ తెలిపారు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు. లభ్యమైన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఒకే కారుతో మూడు రాష్ట్రాల్లో బీభత్సం- చివరకు...

ABOUT THE AUTHOR

...view details